ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Feb 23 2026 6:53 AM | Updated on Feb 23 2026 6:53 AM

ముగిస

ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

అమరాపురం: మండలంలోని హేమావతి గ్రామంలో వెలసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. స్వామి వారికి ఉదయం అర్చకులు సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. భక్తులు తీసుకొచ్చిన పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాద వినియోగం చేశారు.

హుండీ ఆదాయం రూ.10 లక్షలు

మండలంలోని సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన హుండీ కానుకలను ఆలయ ఈఓ నరసింహరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్‌ కరేగౌడ, గ్రామపెద్దల సమక్షంలో లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండీల ద్వారా రూ.10,01,001 ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. వెండి, బంగారు ఆభరణాలు అందాయన్నారు. స్వామి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.

విద్యుదాఘాతంతో

ఎలక్ట్రీషియన్‌ మృతి

ముదిగుబ్బ: మండల పరిధిలోని కృష్ణాపురం క్రాస్‌ రైల్వేగేటు వద్ద ఉన్న వ్యవసాయ తోటలో తుమ్మల కృష్ణ (45) అనే ఎలక్ట్రీషియన్‌ ఆదివారం విద్యుదాఘాతంతో చనిపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు .. ముదిగుబ్బలోని గీతా కాలనీలో నివాసం ఉంటున్న తుమ్మల కోదండ రాముడు చిన్న కుమారుడైన తుమ్మల కృష్ణ ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే వ్యవసాయ తోటలో విద్యుత్‌ స్తంభం ఎక్కి కరెంట్‌ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. మృతునికి భార్య రజిత ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

9 మంది జూదరుల అరెస్ట్‌

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. గంగిరెడ్డిపల్లికి చెందిన సురేష్‌ , ఆంజనేయులు, పెడపల్లికి చెందిన డి. ఆనంద్‌నాయక్‌ గంగిరెడ్డిపల్లిలోని గూలూరు ఆంజనేయులు పొలంలో పేకాట ఆడిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశామన్నారు. ఇందులో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పారిపోయారన్నారు. వారి వద్ద నుంచి రూ.44,250 నగదు, 8 సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో పట్టుబడిన సురేష్‌ ఇది వరకే కేసుల్లో ఉండంతో ఇటీవలనే రూ.లక్ష పూచికత్తుతో తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశామన్నారు. ఎక్కడైనా పేకాట, మట్కా , అక్రమ మద్యం తయారీ, సరఫరా వంటివి నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 1
1/2

ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 2
2/2

ముగిసిన సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement