వీరభద్రుని సేవలో ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

వీరభద్రుని సేవలో ఎస్పీ

Dec 29 2025 9:14 AM | Updated on Dec 29 2025 9:14 AM

వీరభద

వీరభద్రుని సేవలో ఎస్పీ

లేపాక్షి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయాన్ని ఎస్పీ సతీష్‌కుమార్‌ దంపతులు, ఏఎస్పీ అంకిత ఆదివారం సాయంత్రం వేర్వేరుగా సందర్శించారు. వారికి ఆలయ కమిటీ చైర్మన్‌ కరణం రమానందన్‌ ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించడంతో ఆలయ విశిష్టతను తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ చైర్మన్‌, సిబ్బంది ఘనంగా సత్కరించారు.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ‘ధర్మవరం నాట్య కళాకారులు’

ధర్మవరం అర్బన్‌: ధర్మవరం లలిత నాట్య కళానికేతన్‌ గురువులు, శిష్య బృందం మరోసారి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో భారత్‌ ఆర్ట్స్‌ అకాడమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కూచిపూడి కళా వైభవంలో ధర్మవరం లలిత నాట్య కళానికేతన్‌ గురువులు బాబు బాలాజీ, రామ లాలిత్యతో పాటు 25 మంది నాట్య కళాకారులు బృంద నాట్యం చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించారు. ఇప్పటికే నాలుగుసార్లు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించినట్లు గురువు బాబు బాలాజీ తెలిపారు. అనంతరం కళాకారులకు సర్టిఫికెట్లు, అవార్డులు అందించారు.

రైలు నుంచి

జారి పడి యువకుడి మృతి

పెనుకొండ రూరల్‌: రైలులో ప్రయాణిస్తూ జారి పడటంతో యువకుడు మృతి చెందిన సంఘటన మక్కాజిపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలమేరకు.. మడకశిర మండలం ఈచలెడ్డి గ్రామానికి చెందిన. ఎం. గోపాల్‌ (22) శుక్రవారం రాత్రి రైలులో అనంతపురం వెళ్తున్నాడు. మార్గ మధ్యలో మక్కాజిపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. శనివారం ఉదయం రైల్వే కీ మ్యాన్‌ క్షతగాత్రుడిని గుర్తించాడు. రైల్వే పోలీసులకు సమాచారం అందించగా.. ప్రైవేట్‌ అంబులెన్స్‌ ద్వారా పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయస్థాయి

పోటీల్లో ప్రతిభ

కదిరి అర్బన్‌: తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం జరిగిన 3వ గోల్‌షాట్‌బాల్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ చాంపియన్‌ కప్‌ –2025 పోటీల్లో (మహిళా విభాగం) ఏపీ జట్టు మూడో స్థానం సాధించినట్లు కోచ్‌ ప్రసన్నరాజేష్‌ తెలిపారు. తృతీయస్థానం సాధించడంపై ఏపీ గోల్‌షాట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఆర్‌జీఎం కింద 50

పశు శిబిరాలు పూర్తి

అనంతపురం అగ్రికల్చర్‌: మేలు జాతి పశుసంతతి పెంపు లక్ష్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఆదివారం నాటికి 50 పశు సంతానోత్పత్తి శిబిరాలు పూర్తిచేసినట్లు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్‌ లైవ్‌స్టాక్‌ ఏజెన్సీ–డీఎల్‌డీఏ) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఈఓ) డాక్టర్‌ జి.వెంకటేష్‌ తెలిపారు. రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ (ఆర్‌జీఎం) కార్యక్రమంలో భాగంగా రాయలసీమ గ్రామీణ పశుయోజన కింద ఉచితంగా పశవులకు ఉచితంగా లింగ నిర్ధారణ వీర్యం (సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌–ఎస్‌ఎస్‌ఎస్‌) ద్వారా కృత్రియ గర్భోత్పత్తి (ఎద సూదులు) వేశామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో అనంతపురం జిల్లాతో పాటు కుప్పం డివిజన్‌లో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలుకు అవకాశం ఇచ్చారన్నారు. గతంలో ఒక్కో ఎద సూదికి రూ.500 వసూలు చేస్తుండగా ఇప్పుడు పూర్తిగా ఉచితమని తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి ప్రతి మండలంలో కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఇప్పటికి 50 పూర్తి చేశామన్నారు. ఎస్‌ఎస్‌ఎస్‌ పద్ధతిలో ఎద సూదులు వేయడం వల్ల 90 శాతం వరకు ఆడదూడలు (ఫిమేల్‌) పుడతాయన్నారు. అలాగే జన్యుపరంగా మంచి ఆరోగ్యవంతమైన దూడలు అందుబాటులోకి వస్తాయన్నారు.

వీరభద్రుని సేవలో ఎస్పీ 1
1/2

వీరభద్రుని సేవలో ఎస్పీ

వీరభద్రుని సేవలో ఎస్పీ 2
2/2

వీరభద్రుని సేవలో ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement