అల్లాహ్ ముందు అందరూ సమానమే
కదిరి అర్బన్: అల్లాహ్ ఎదుట అందరూ సమానమేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ముస్లిం మతపెద్దలు సూచించారు. రెండు రోజులుగా కదిరి మండలం సున్నపుగుట్టతండా బైపాస్ రోడ్డు పక్కన నిర్వహిస్తున్న ఇస్తెమా ఆదివారం ముగిసింది. చివరి రోజు సాయంత్రం పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగాయి. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ముస్లిం మత పెద్ద హాజీ ఫారూక్ సాహెబ్, ముఫ్తి నిసార్‌తో పాటు పలువురు మతపెద్దలు పాల్గొన్నారు. నమాజ్ చేయడంతో పాటు ప్రసంగాలు, సందేశాలిచ్చారు. ఇజితిమాకు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయక్త బీఎస్ మగ్బూల్ అహ్మద్, పీఏసీ మెంబర్ ఎస్‌ఎండీ ఇస్మాయిల్ , మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తదితరులు హాజరయ్యారు.
ఉచిత వైద్య శిబిరాలు
ఇస్తెమా ప్రాంతంలో పట్నం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏపీ మెప్నా, స్విమ్స్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కదిరిలో ప్రాంతంలో జరిగిన ఇస్తెమాకు రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
అల్లాహ్ ముందు అందరూ సమానమే


