ముగిసిన జాతీయస్థాయి టెన్నిస్ టోర్నీ
హిందూపురం టౌన్: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న టెన్నిస్ కోర్టులో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయస్థాయి వెటరన్ టెన్నిస్ టోర్నీ ఆదివారం ముగిసింది. నాలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 60 జట్లు టోర్నీలో పాల్గొన్నాయి. 45, 55, 65,70 వయస్సు వారిగా పోటీల్లో పాల్గొన్నారు. 65 ఏళ్ల విభాగంలో ఏపీకి చెందిన శ్రీనివాసరెడ్డి, జ్యోతిరెడ్డి జట్టు, 55 ఏళ్ల విభాగంలో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాగేష్‌బాబు, మహేష్ కేశవ జట్టు విజయం సాధించారన్నారు. అలాగే 45 ఏళ్ల విభాగంలో బెంగళూరుకు చెందిన అర్ముగం, రాజేష్ బాబు జట్టు, 70 ఏళ్ల విభాగంలో డాక్టర్ చంద్రశేఖర్, మిశ్రీమల్ విన్నర్స్‌గా నిలిచారన్నారు. మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్ ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు రాజ్యలక్ష్మీ మోహన్, నాగేష్, నాగరాజు, సురేష్ కుమార్, శివశంకర్, సుమో శీన తదితరులు పాల్గొన్నారు.


