పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభం
లేపాక్షి: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభమైంది. పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా క్రీడామైదానంలో నవోదయ ప్రీమియం క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించగా 10 జట్లు పాల్గొన్నాయి. మొదటి రోజు 1000 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారని, ఆదివారం మరో 1000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందని ప్రిన్సిపాల్ నాగరాజు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు వేమనారాయణ, వినోద్‌కుమార్, రాజారెడ్డి, శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొత్తం 32 బ్యాచ్‌ల విద్యార్థులు హాజరై అప్పటి గురవులను ఘనంగా సత్కరిస్తారన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


