
భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
ప్రశాంతి నిలయం: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ రహదారుల విస్తరణకు భూసేకరణ, సోలార్‌పార్కుల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పుట్టపర్తి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య, ఎన్‌హెచ్ ప్రాజెక్ట్‌ల ప్రతినిధులు, ఫారెస్ట్, భూసేకరణ, రెవెన్యూ ఽఅధికారులు పాల్గొన్నారు.
పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించండి
జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్‌హాలులో నిర్వహించిన జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహిక కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువతకు యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా కొత్తగా పరిశ్రమల స్థాపనకు వచ్చిన అనుమతులను సమీక్షించారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, జిల్లా ఫ్యాక్టరీల అధికారి రాధాకృష్ట, ఏపీఐఐసీ, విద్యుత్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో బిజినెస్ రీఫామ్ యాక్షన్ ప్లాన్– 2024పై సమావేశం జరిగింది. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల ప్రోత్సాహకంలో భాగంగా సులభతర వాణిజ్యానికి సత్వర సేవలందిస్తున్నాయన్నారు.