
హోరాహోరీగా ఎడ్లబండి పోటీలు
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన వినాయక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. 57 బండ్లు పోటీల్లో పాల్గొనగా పట్నం గ్రామానికి చెందిన మౌర్య సుల్తాన్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. అలాగే కొత్తచెరువు చెందిన భరత్ ఎద్దులు ద్వితీయ, కర్ణాటక నాగేపల్లికి చెందిన దేవర ఎద్దులు తృతీయ స్థానంలో నిలిచాయి. విజేత ఎద్దుల యజమానులను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు బాబురెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.