
యూరియా కోసం ఆందోళన చెందొద్దు
న్యూస్‌రీల్
పుట్టపర్తి అర్బన్: యూరియా కోసం రైతులెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ చేతన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయశాఖకు సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం 4,700 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, పారిశ్రామిక అవసరాలకు మళ్లించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి, ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి ఉదయ్‌కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి మహేష్, లేబర్ ఆఫీసర్ సూర్యనారాయణ, పశువైద్యాధికారి సుభదాస్ తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ ప్రవేశాలకు
దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో యూజీ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ సత్యలత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ నెల 26వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.