
● వినీలాకాశంలో కనువిందు
పెట్రోల్ బంకుల్లో
ఎప్పటికప్పుడు ఆడిట్
అనంతపురం: జైళ్ల శాఖ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ఆడిట్ పక్కాగా నిర్వహిస్తామని జిల్లా ఉప కారాగారాల అధికారి ఈ.అనిల్ బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని పెట్రోల్ బంకులో అక్రమాలు చోటు చేసుకున్న అంశంపై ‘జైళ్ల శాఖ పెట్రోల్ బంకుల్లో అక్రమాలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఆయన స్పందించారు. ధర్మవరం సబ్‌జైలు అధికారి బదిలీ అయిన సమయంలో హెడ్ వార్డెన్‌కు పెట్రోల్ బంక్ బాధ్యతలు అప్పగించారని, నగదు తక్కువగా ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
పరిగిలో బుధవారం ఇంద్ర ధనుస్సు కనువిందు చేసింది. సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. అదే సమయంలో ఎండ కాస్తుండగా ఏర్పడిన ఇంద్రధనుస్సు చూపరులను ఆకట్టుకుంది. – పరిగి:
● భలే.. భలే ఊసరవెల్లి
జిల్లాలోని తోటల్లో తొండలు చాలా కనిపిస్తాయి. చాలా అరుదుగా ఊసరవెల్లి కనిపిస్తుంది. ఈ రెండింటికీ పోలిక ఉన్నా.. ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. పల్లెల్లో అరుదుగా కనిపించే ఈ ఊసరవెల్లులు.. పట్టణ, నగర వాసులకు మాత్రం ఓ వింతగానే గోచరిస్తుంటాయి. బుధవారం పెనుకొండ పట్టణ సమీపంలోని మెడికల్ కళాశాల సమీపంలో రోడ్డు దాటుతూ ఓ ఊసరవెల్లి స్థానికులను అబ్బుర పరిచింది. దాని మనస్సులోని చిరాకు, భయం, కోపం లాంటి ఉద్వేగాలకు అనుగుణంగా రంగులు మారుస్తూ పొదల్లోకి వెళ్లడాన్ని ఆశ్చర్యంగా పరిశీలించారు.
– పెనుకొండ:

● వినీలాకాశంలో కనువిందు