
స్వాతంత్య్ర సమరంలో ‘దుర్గం’ యోధులు
రాయదుర్గం/టౌన్: రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఓబుళాచార్యులు, కెరె శరణప్ప, ఎన్‌సీ శేషాద్రీ, జగన్నాథ్‌సింగ్, నిప్పాణి రంగరావు, వైహెచ్ సుబ్బారావు, సత్యభామాదేవి, మోపూరు చంద్రకాంతనాయుడు, శిరిగేదొడ్డి గ్రామస్తుడు దామోదర సింగ్, నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కట్టరావుప్ప ఇలా ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్య్ర యోధులు భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని రాయదుర్గం ప్రాంత కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేశారు. ప్రముఖ గాంధేయవాది, న్యాయవాది గురుమాల్ నాగభూషణం 1941లో స్వాతంత్య్ర పోరాటంలో అరెస్ట్ అయి 1941 మే 12 నుంచి బీజాపుర్ జిల్లా ఇండాలిగి సెంట్రల్ జైలులో 3 నెలల కారాగార శిక్ష అనుభవించారు. వరదా చెన్నప్ప, తిప్పయ్య 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 3 నెలల కఠిన కారాగార శిక్షను అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వైహెచ్ సత్యభామాదేవి రెండు నెలల జైలు శిక్ష అనుభవించారు. వ్యక్తిగత సత్యాగ్రహం చేసి ఆర్.నాగన్నగౌడ్ రూ.400లు దండన చెల్లించి ఏడాది కారాగార శిక్ష అనుభవించారు. బసవన్న గౌడు, చిందనూరు నాగప్ప శెట్టి ఇతర ప్రముఖులతో కలసి ఓబుళాచార్యులు తమ వంతు సేవలందించారు. వీరి జ్ఞాపకార్థం రాయదుర్గం పట్టణంలోని ఒక రోడ్డుకు ఓబుళాచారి రోడ్డు అని నామకరణం చేశారు.

స్వాతంత్య్ర సమరంలో ‘దుర్గం’ యోధులు

స్వాతంత్య్ర సమరంలో ‘దుర్గం’ యోధులు