
టీడీపీ నేత దౌర్జన్యం.. యూరియా అక్రమ నిల్వ
చిలమత్తూరు: యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీకి చెందిన ఓ టీడీపీ నేత సుమారు 200 బస్తాల యూరియాను కోడూరు, చిన్నపరెడ్డి గ్రామాల్లో అక్రమంగా దాచి పెట్టాడు. గురువారం తెల్లవారు జామున యూరియా కోసం ఆర్‌ఎస్‌కేల వద్దకు చేరుకున్న రైతులు యూరియా లేదని తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతుండగా అక్రమంగా దాచిపెట్టిన విషయం కాస్త వెలుగు చూసింది. బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేందుకు వాటిని దాచి ఉంచారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వ్యవసాయశాఖ అధికారులకు తెలిసే ఈ తతంగం జరిగిందని రైతులు విమర్శించారు.
జానపద గాయని సరళకు భారత్ ఐకాన్ నేషనల్ అవార్డు
ధర్మవరం అర్బన్: వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, శిఖరం ఆర్ట్ థియేటర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇస్తున్న భారత్ ఐకాన్ నేషనల్ అవార్డు ఈ ఏడాది ధర్మవరానికి చెందిన జానపద గాయని సరళను వరించింది. జానపద గాయనిగా, పరిశోధనాత్మక రచయితగా, డీడీఆర్ ప్రాజెక్టు బ్రాండ్ అంబాసిడర్‌గా సరళ నిలిచారు. ఈ నెల 19న న్యూఢిల్లీలోని లోక్ కళామంచ్‌లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేతుల మీదుగా ఆమెకు అవార్డును అందించనున్నట్లు సంస్థ చైర్మన్ శ్రీకృష్ణ గొల్ల పేర్కొన్నారు.

టీడీపీ నేత దౌర్జన్యం.. యూరియా అక్రమ నిల్వ