
చిరస్మరణీయుడు ‘యర్రమల’
దేశం పట్ల అచంచల భక్తివిశ్వాసాలున్న యర్రమల కొండప్ప త్యాగం చిరస్మరణీయం. 1890లో ఓ గొప్ప భూస్వామ్య కుటుంబంలో జన్మించి, విద్యావంతుడై పోలీసు శాఖలో పనిచేశారు. ఆ రోజుల్లోనే గుంతకల్లు సభలో బాలగంగాధర్ తిలక్ ఉపన్యాసంతో ప్రభావితుడైన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఈ క్రమంలో 1921లో బ్రిటీష్ సైనికులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. 1934లో మహాత్మాగాంధీ అనంతకు విచ్చేసిన సమయంలో హరిజనోద్ధరణ పిలుపునకు ప్రభావితుడై అదే స్ఫూర్తితో అనంతపురంలోని అశోక్ నగర్‌లో ఎంతో విలువైన రెండు ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు. ఆ స్థలంలోనే ప్రస్తుతం అంబేడ్కర్ భవనం నడుస్తోంది.