చేనేత కార్మికుడి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన చాకలి రంగ (45)కు భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాఆపరుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.3 లక్షలకు చేరుకుంది. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన రంగ... శుక్రవారం కోమలి – జూటూరు గ్రామాల మధ్య ఉన్న పట్టాలపైకి చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


