
లాభదాయకంగా సాగింది
మార్కెట్‌కు ఈ ఏడాది 1.13 లక్షల క్వింటాళ్లకు పైగా చింత పండు వచ్చింది. దీంతో కమీషన్ రూపంలో మార్కెట్ యార్డుకు ఆదాయం బాగా కలిసొచ్చింది. వ్యాపారులు సైతం ఈ ఏడాది మంచి ధరలు ఉంటాయని భావించి సరుకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచారు. దీంతో వ్యాపారం లాభదాయకంగా సాగింది. 700 లారీల వరకు సరుకు శీతల గోదాముల్లో నిల్వ ఉంది.
– వేణగోపాలరెడ్డి, కోల్డ్ స్టోరేజ్ యజమాని, హిందూపురం
ధరలు నిలకడ
హిందూపురం మార్కెట్‌కు కరోనా తర్వాత ఈ ఏడాది చింత పండు, మిర్చి రికార్డు స్థాయిలో వచ్చింది. ధరలు సైతం ఈ ఏడాది నిలకడగా కొనసాగాయి. చింతపండు క్వింటా గరిష్టంగా రూ.33వేలతో అమ్ముడుపోయింది. అలాగే మిర్చి క్వింటా ధర రూ.28 వేల వరకు పలికింది. దీంతో ఈ సారి మార్కెట్‌కు ఆశించిన మేర సరుకు రావడంతో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగాం.
– జి. చంద్రమౌళి, మార్కెట్ యార్డు కార్యదర్శి, హిందూపురం

లాభదాయకంగా సాగింది