జేఎన్‌టీయూ(ఏ) ప్రొఫెసర్‌ ప్రశాంతి ఆవిష్కరణకు దక్కిన పేటెంట్‌ | - | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూ(ఏ) ప్రొఫెసర్‌ ప్రశాంతి ఆవిష్కరణకు దక్కిన పేటెంట్‌

Published Wed, Nov 15 2023 12:12 AM | Last Updated on Wed, Nov 15 2023 12:12 AM

-

అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్‌ కళాశాల మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ జి.ప్రశాంతి పరిశోధనకు పేటెంట్‌ దక్కింది. ప్రొఫెసర్‌ జి.ప్రశాంతి, పరిశోధన విద్యార్థి ఎం.శివసూర్య సంయుక్తంగా ‘ఏ న్యూ మెథడ్‌ టు ఫ్యాబ్రికేట్‌ డిఫరెంట్‌ లేయర్డ్‌ ఎల్‌ 7075/ఎస్‌ఐసీ ఫంక్షనల్లీ గ్రేబ్డ్‌ మెటీరియల్స్‌ యూసింగ్‌ పవర్‌ మెటాలార్జీ టెక్నిక్‌’ అంశంపై చేసిన పరిశోధనకు గాను పేటెంట్‌ దక్కింది. ఈ పరిశోధన ముఖ్యంగా వాహనాల బ్రేక్‌ కాంటాక్ట్‌కి సంబంధించినది కావడం గమనార్హం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక వచ్చేలా 10 ఎం.ఎం. మందం గల బ్రేక్‌ సత్ఫలితాలను ఇచ్చింది. 2021, మార్చి నెలలో పేటెంట్‌కు దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 14న పేటెంట్‌ గ్రాంట్‌ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్‌ జి. ప్రశాంతిని వీసీ డాక్టర్‌ జింకా రంగజనార్దన తదితరులు మంగళవారం సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement