కళ్యాణదుర్గం: కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడంపై ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీఓ భవనంలో గురువారం ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో తాలూకా కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. 22 ఏళ్లుగా నలుగుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఏపీ ఎన్జీఓ నాయకులు ఫార్మసిస్ట్ మహేష్, కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగుల రాష్ట్ర కన్వీనర్ జాన్సన్, యూనియన్ నాయకులు నర్సారెడ్డి, గంగరాజు, పురుషోత్తం, వీరశేఖర్, హనుమంతరాయుడు, గోవిందరాజులు, నారాయణ తదితరులు ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉద్యోగులు నారాయణ, తిప్పేస్వామి, గోవిందరాజులు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.