విద్యుదాఘాతంతో యువకుడి మృతి

చెన్నేకొత్తపల్లి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గంగినేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. గంగినేపల్లికి చెందిన అమరనాథ్ (37) నూతనంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇంటికి నీరు పెట్టేందుకుగాను వాడుతున్న మోటర్‌కు కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.