ఉదయగిరి రూరల్: ఈనెల 5వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ హాలును మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వెంకటరెడ్డితో కలిసి ట్రెయినీ కలెక్టర్ పవన్‌తేజ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలందించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. వారి వెంట ఎంపీడీఓ సుకుమార్ ఉన్నారు.
మద్యం దుకాణాలకు
సీల్
నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని 34 మండలాల పరిధిలో 30 జెడ్పీటీసీలు, 362 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 48 గంటల ముందుగానే మద్యం విక్రయాలు నిలిపివేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం సాయంత్రం జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు ఒక కిలోమీటర్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఎకై ్సజ్ అధికారులు సీళ్లు వేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం దుకాణాలు తిరిగి తెరుచుకోనున్నాయి. అలాగే 7న ఓట్ల లెక్కింపు జరుగనుండటంతో కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నారు.
ముగిసిన కౌంటింగ్ ప్రక్రియ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరిగింది. ఈ క్రమంలో కళాశాల వద్దకు వచ్చే రెండు మార్గాల్లో ముళ్లకంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. డీకేడబ్ల్యూ కళాశాల పరిసర ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు తరలిరావడంతో పోలీసు అధికారులు వారిని అక్కడి నుంచి దూరంగా పంపివేశారు.
కండలేరులో
16.732 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 16.732 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
నేలవాలిన అరటి పంట
ఇందుకూరుపేట: మురసు తుఫాన్ కారణంగా వీచిన బలమైన గాలులకు మండలంలోని అరటి పంట నేల వాలింది. కొత్తూరు, ఇందుకూరుపేట, డేవిస్‌పేట, జగదేవిపేట, లేబూరు, రావూరు తదితర గ్రామాల్లో అరటి సాగు విస్తారంగా సాగుతోంది. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అరటి పంట నేలవాలిపోయింది. కాగా పెద్దస్థాయిలో వర్షపాతం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


