● మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
ఉదయగిరి: మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, ఎన్నికల ప్రచారంలో రాజకీయాల గురించి మాట్లాడితే హుందాతనంగా ఉంటుందని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి హితవు పలికారు. మండలంలోని అప్పసముద్రం గ్రామంలో మంగళవారం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కొండా యశోద, ఎంపీటీసీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు కాకుండా హుందాతనంతో వ్యవహరించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందన్నారు. అనంతరం చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను మండల కన్వీనర్‌గా, సొసైటీ చైర్మన్‌గా పనిచేశానని, ఆ సమయంలో ఏడు పర్యాయాలు రూ.70 లక్షలు తన వద్ద తీసుకున్నాడన్నారు. గతంలో కూడా తనను అగౌరవపరుస్తూ వ్యక్తిగత దూషణలకు దిగాడని, ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ఇంటింటికీ తిరిగి ఫ్యాను గుర్తుపై ఓటేయాలని కోరారు. ప్రచారంలో మండల కన్వీనర్ రాజగోపాల్‌రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి మోది రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు గానుగపెంట ఓబుల్‌రెడ్డి, షంషీర్, వాకా సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.


