ఇందుకూరుపేట: ఆశ కార్యకర్తలు కుటుంబ సభ్యులుగా వ్యవహరిస్తూ వైద్యసేవలు అందించి గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదర్‌వలీ సూచించారు. మండలంలోని జగదేవిపేట పీహెచ్‌సీలో జరిగిన ఆశా డే కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల సెంట్రల్ టీమ్ సందర్శించినప్పుడు టీబీ బాధితులకు అందిస్తున్న ఆరోగ్య సేవల గురించి వివరాల సేకరించారన్నారు. అప్పుడు రోగికి జగదేవిపేట ఆశా వలంటీర్ హైమావతి అందించిన సేవలు తెలుసుకుని చాలా సంతోషపడ్డారని, ఆమె సేవలను కొనియాడారని తెలిపారు. ఇలా మిగిలిన వారు కూడా మంచి సేవలందించి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ కిశోర్‌కుమార్, బ్రహ్మేశ్వరనాయుడు, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ విజయకుమార్, హెచ్‌ఈఓ శ్రీనివాసరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధాకర్‌రావు, సూపర్‌వైజర్లు రమా, సతీష్‌బాబు పాల్గొన్నారు.


