ఎన్నికల నియమావళి పాటించండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళి పాటించండి

Nov 4 2026 2:02 AM | Updated on Nov 4 2026 2:02 AM

నెల్లూరు(పొగతోట): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నియమావళిని తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికారులతో వారు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సూచనలు, సలహాలిచ్చారు. జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల సామాగ్రి పంపిణీ

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 4వ తేదీ ఉదయం మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతుందని జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య అధికారులకు సూచించారు. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల వద్ద ఎలాంటి సమస్యల్లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రూట్‌ల ప్రకారం ఎన్నికల సామగ్రిని సమర్థవంతంగా అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement