● కాకాణి పూజితారెడ్డి
ముత్తుకూరు: అరాచక పాలన ఎన్నో రోజులు సాగదని, అధికార పార్టీ నాయకులు అభ్యర్థులను బెదిరిస్తున్నారని, పోలీసులను ఉసిగొలిపితే గెలుస్తామనే భ్రమల్లో ఉన్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి అన్నారు. ముత్తుకూరు బలిజపాళెంలో సోమవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కరినైనా ఓడించాలని వారు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి ఓటమి తప్పదన్నారు. ప్రజలు మోసపోయే పరిస్థితుల్లో లేరన్నారు. టీడీపీ అరాచకాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ధైర్యం ఉంటే పోలీసులు లేకుండా ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందిగా సవాల్ విసిరారు. జెడ్పీటీసీ అభ్యర్థి నెల్లూరు పరిమళ, ఎంపీటీసీ అభ్యర్థి పావనీలను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుగుణ, మాజీ జెడ్పీటీసీ శివప్రసాద్, ఈదూరు రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఈదూరు శ్రీనివాసులురెడ్డి, నవీద్‌బాషా, సూరి పాల్గొన్నారు.


