ఓటమి భయంతోనే ఎన్నికల్లో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే ఎన్నికల్లో అక్రమాలు

Nov 2 2026 11:51 PM | Updated on Nov 2 2026 11:51 PM

● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి

చంద్రశేఖర్‌రెడ్డి

చిల్లకూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించలేమని భావించిన అధికార పార్టీ అరాచకాలకు తెరలేపింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు చేస్తున్నారు. పోలీసులతో కుమ్మక్కై అక్రమ కేసులకు పెడుతున్నారు’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని తన సొంత గ్రామం వల్లిపేడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూరి లక్ష్మమ్మను గెలిపించాలని సోమవారం ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను దూరం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతి పేదవాడు గుండె మీద చేయి వేసుకుని నిర్భయంగా ఉండేరోజు రావాలంటే కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సెగ్మెంట్‌లో పోటీ చేస్తున్న లక్ష్మమ్మను గెలిపించి మండలంలో జెండా ఎగురవేయాలన్నారు. అనంతరం ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీ నర్‌ యద్దల మధుసూదన్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ పొలుబోయిన చెంగయ్య, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement