ప్రజాతీర్పుపై ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

ప్రజాతీర్పుపై ఉత్కంఠ

Nov 2 2026 11:51 PM | Updated on Nov 2 2026 11:51 PM

నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పుపై ప్రజలతో పాటు రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దఫా మేయర్‌పాటు చైర్‌పర్సన్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండడంతో కార్పొరేషన్‌లో మేయర్‌, మున్సిపాలిట్టీల్లో చైర్మన్‌ అభ్యర్థులకు, డివిజన్‌ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు వేర్వేరుగా ఓటు వేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందనే ప్రచారం విస్తృతం కావడంతో ప్రజాతీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

డీకేడబ్ల్యూలో కార్పొరేషన్‌ కౌంటింగ్‌

నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌ఎంసీ పరిధిలో మొత్తం 72 డివిజన్లు ఉన్నాయి. అందులో 4,89,351 మంది ఓటర్లు ఉండగా 509 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఆయా కేంద్రాల ద్వారా ఆదివారం 2,82,466 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 72 డివిజన్లలో 8 డివిజన్లు ఏకగ్రీవం కాగా మిగిలిన 64 వార్డులకు సంబంధించి కార్పొరేటర్ల అభ్యర్థులతోపాటు 72 డివిజన్లలో మేయర్‌ అభ్యర్థుల ఓట్లను లెక్కించనున్నారు. ఇందు కోసం 43 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక డివిజన్‌కు సంబంధించి లెక్కింపును ఐదు రౌండ్లలో పూర్తి చేయనున్నారు. మేయర్‌ ఓట్ల లెక్కింపునకు 38 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బ్యాలెట్‌ బాక్స్‌లోని ఓట్లను కుమ్మరించి.. తొలుత మేయర్‌, కార్పొరేటర్‌ బ్యాలెట్స్‌ను వేరు చేస్తారు. ఆ తర్వాత పార్టీల వారీగా ఓట్లను విభజించి లెక్కించనున్నారు.

12 గంటల్లోనే ఫలితాలు వెల్లడి

నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలకు సంబంధించిన స్థానిక సంస్థ ఎన్నికల ఓట్లు లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దాదాపు మధ్యాహ్నం 12 గంటలకంతా పూర్తి ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారుల చెబుతున్నారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు మూడంచెల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

నేడు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం

ఒక డివిజన్‌కు ఒక గది చొప్పున

19 గదుల్లో కౌంటింగ్‌

నాలుగు రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం

ఉదయం 8 నుంచి

కౌంటింగ్‌ ప్రారంభం

మధ్యాహ్నం 12 గంటలకే పూర్తి.. ఫలితాలు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement