మరపురాని నేత గౌతమ్‌ | - | Sakshi
Sakshi News home page

మరపురాని నేత గౌతమ్‌

Nov 2 2026 11:51 PM | Updated on Nov 2 2026 11:51 PM

● ఘనంగా దివంగత మంత్రి

గౌతమ్‌రెడ్డి జయంతి వేడుకలు

మర్రిపాడు: ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని ప్రతిఒక్కరి ప్రేమాభిమానాలకు పాత్రుడై అందరి మదిలో జ్ఞాపకంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిలిచిపోయారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జయంతి వేడుకలను కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి రాజమోహన్‌రెడ్డి, మణిమంజరి దంపతులు, ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి హుందాతనం, విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయ నేతగా ఎదిగారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని స్మరించుకున్నారు. గౌతమ్‌రెడ్డి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement