తుపానుపై అప్రమత్తంగా ఉండండి | - | Sakshi
Sakshi News home page

తుపానుపై అప్రమత్తంగా ఉండండి

Nov 2 2026 11:51 PM | Updated on Nov 2 2026 11:51 PM

నెల్లూరు(అర్బన్‌): మురసు తుపానుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు. పెట్రోలు, డీజిల్‌, ఎల్పీజీ సిలిండర్లతో పాటు పీడీఎస్‌ ద్వారా సరఫరా చేసే బియ్యం, చక్కెర తదితర నిత్యావసర వస్తువులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని 267 పెట్రోల్‌ బంకుల్లో 1,710 కిలోలీటర్ల పెట్రోలు, 2,832 కిలోలీటర్ల డీజిల్‌, 57 ఎల్పీజీ అవుట్‌లెట్లలో 21,385 సిలిండర్లు నిల్వ ఉన్నాయని చెప్పారు. 1470 చౌకదుకాణాల పరిధిలో 10,832.215 మెట్రిక్‌ టన్నులబియ్యం, 374.727 మెట్రిక్‌ టన్నుల చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎక్కడా ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టారని తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, వస్తువులను అఽధిక ధరలకు విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుపానుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వదంతులను నమ్మి అధిక మొత్తంలో నిత్యావసర సరుకులను కొనుగోలు చేయవద్దని, సాధారణ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని సూచించారు.

ప్రజలు ఆందోళన చెందాల్సిన

అవసరం లేదు

సమృద్ధిగా నిత్యావసర వస్తువులు

కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

కలెక్టర్‌ హిమాన్షుశుక్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement