● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మున్సిపాల్టీతో పాటు నియోజకవర్గంలో పోటీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వశం చేసుకోనుందని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కరటంపాడు, పడకండ్ల జెడ్పీటీసీ సెగ్మెంట్ల పరిధిలో గల ఆరు గ్రామాల్లో జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. పడకండ్ల సెగ్మెంట్‌లోని వెన్నవాడ, గండ్లవేడు, యర్రబల్లి, బొటికర్లపాడు, పడకండ్లలో ఇంటింటికీ తిరిగి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. బొటికర్లపాడుకు చెందిన టీడీపీ నేత ఏనుగంటి నాగయ్యచౌదరి కుటుంబసభ్యులను పార్టీ నేతలు కలిశారు. తమ గ్రామాలను డీసీపల్లి జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా రోడ్డు నిర్మాణం కోసం అనేక యత్నాలు చేశానని, చివరికి దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ద్వారా ఆ కల సాకారమైందని చెప్పారు. పార్టీ పడకండ్ల అభ్యర్థి కొల్లి దొరస్వామినాయుడు ఘన విజయం సాధించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీలో ఇటీవల చేరిన పాశం లింగయ్య తిరిగి విక్రమ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, దిశించర్ల ప్రసాద్‌నాయుడు, మాముడూరు ప్రసాద్, దాడి శ్రీనివాసులునాయుడు, న్యాయవాది ఓబులేసు, కోటంరెడ్డి సుబ్బారెడ్డి, పర్వతరెడ్డి మధురెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


