ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ పేరుతో ఓటుకు నోటు కూడా అందజేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సమస్యాత్మకమైన ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించి తమకు ప్రతికూల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి వారిని ఓటింగ్ కేంద్రానికి రానివ్వకుండా చేసే ప్రయత్నం. ఓటుకు ప్రాంతాన్ని బట్టి రూ.వెయ్యి, రూ.రెండు వేలు చొప్పున అందజేసి వారందరితో తమ పార్టీకే ఓటు వేయాలని ప్రమణాలు చేయించుకోవడం వంటి వాటికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎక్కడా కూడా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు.


