అబద్ధాల చంద్రబాబును గద్దె దించాలి | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల చంద్రబాబును గద్దె దించాలి

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

తోటపల్లిగూడూరు: అబద్ధాలు చెబుతూ అవినీతి, అక్రమాలు, ప్రలోభాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న చంద్రబాబును గద్దె దించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కోడూరు పంచాయతీ కోడూరు బిట్‌ 1, బిట్‌ 2 ప్రాంతాల్లో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో గురువారం కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూపించి తామే చేశామని ఓట్లు అడుక్కోవడానికి చంద్రబాబుకి సిగ్గుండాలని విమర్శించారు. తమ హయాంలో కోడూరులో సిమెంట్‌ రోడ్లు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణాలు మొదలైన పనులు చేశామని అందుకే ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. చంద్రబా బు తన అధికార మదంతో వ్యవస్థలన్నింటిని ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నాడని, వాటిని తిప్పి కొట్టి మెజారిటీ సీట్లు సాధించాలని నాయకులకు సూచించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 79 ఎంపీటీసీ, ఐదు జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టిన ఘనత తనదేనన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నవంబర్‌ 5వ తేదీ జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో కోడూరు బిట్‌ 1 ధర్మదేవ్‌, బిట్‌ 2 అభ్యర్థి దువ్వూరు సుధీర్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి కుసుమాంబను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కావల్‌రెడ్డి సోదరులు, ముత్యాలతోపు, చెన్నపల్లిపాళెం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement