కూటమికి గ్రామాల్లో నిరసన సెగలు | - | Sakshi
Sakshi News home page

కూటమికి గ్రామాల్లో నిరసన సెగలు

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

● వైఎస్సార్‌సీపీ మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూజితా రెడ్డి

పొదలకూరు: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కూటమి నాయకులకు గ్రామాల్లో నిరసన సెగలు తగులుతున్నట్టుగా వైఎస్సార్‌సీపీ మహిళా రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజితా రెడ్డి అన్నారు. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, కీలుకొప్పు కృష్ణమ్మతో కలిసి పూజిత గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లను వేయనీయకుండా అడ్డుకున్నట్టు తెలిపారు. కనీసం మహిళా అభ్యర్థులని కూడా చూడకుండా దాడులకు తెగబడినట్టు ధ్వజమెత్తారు. నిత్యం మహిళల గురించి లెక్చర్లు ఇచ్చే సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే దాడులు యథేచ్ఛగా కొనసాగినట్టు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహిస్తే ఓటమి తప్పదనే భయంతో ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు పాల్పడినట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ధైర్యంగా నిలబడి నామినేషన్లు దాఖలు చేయడం జరిగిందన్నారు. వైఎస్‌ జగన్‌మోమన్‌రెడ్డి నుంచి పార్టీ శ్రేణులు పోరాటపటిమను నేర్చుకున్నట్టు వెల్లడించారు. కూటమి అరాచక పాలన ఎంతోకాలం కొనసాగే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కరిపరెడ్డి కృష్ణారెడ్డి, పి.అశోక్‌కుమార్‌రెడ్డి, గడ్డం తిరుపాల్‌రెడ్డి, కె.రమణారెడ్డి, పుచ్చా చెంచుకృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement