ఎన్నికల నిబంధనలు అతిక్రమించొద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు అతిక్రమించొద్దు

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

నెల్లూరు(పొగతోట): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సూచించారు. గురువారం నెల్లూరులోని జెడ్పీ కార్యాలయం నుంచి ఏఆర్వోలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో వారు మాట్లాడారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్లకు ఓటర్‌ స్లిప్పులు అందజేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బ్యాలెట్‌ పేపర్లను సమీపంలోని అందుబాటులో ఉంటే సబ్‌ ట్రెజరీ, పోలీస్‌స్టేషన్లలో అప్పగించి జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా రూట్‌మ్యాప్‌ అనుసరించి వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణ తేదీల్లో మార్పులు జరిగాయన్నారు. దానికి అనుగుణంగా అధికారులందరూ చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

పీఓలు, ఏపీఓలకు శిక్షణ

నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఎన్నికల నిర్వహణపై గురువారం పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మధుసూదన్‌, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో 11 వేల మంది ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. వచ్చే నెల 5వ తేదీన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. 7వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 4వ తేదీన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లలో ఎన్నికల సామగ్రి అందజేస్తారన్నారు. 1,665 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement