సముద్ర రిసార్ట్స్‌లో ఆక్రమణల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

సముద్ర రిసార్ట్స్‌లో ఆక్రమణల తొలగింపు

Oct 30 2026 2:27 AM | Updated on Oct 30 2026 2:27 AM

ఇందుకూరుపేట: మండలంలోని మైపాడు మజరా కృష్ణాపురంలో ఉన్న సముద్ర రిసార్ట్స్‌లో ఆక్రమణలను జలవనరుల శాఖ అధికారులు తొలగించారు. రిసార్ట్స్‌ యజమానులు బకింగ్‌హామ్‌ కెనాల్‌ కట్లపై శాశ్వత రోడ్డును ఏర్పాటును చేశారు. అంతటితో ఆగకుండా ఆ రోడ్డు పక్కనే గది నిర్మాణం, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు దిమ్మెలను చేపట్టారు. దీనిపై పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు ఫిర్యాదులు అందాయి. వాటిని తొలగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో ఆక్రమణలను తొలగించారు. కాగా ఈ రిసార్ట్స్‌లో ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసిన వారు ఈ తంతు చూసి ఆందోళన చెందుతున్నారు. గతంలో రిసార్ట్స్‌ ఏర్పాటు విషయంలో పలు ఆరోపణలువచ్చాయి. తాజాగా ఆక్రమణలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్‌లో దీనిపై పలు నిబందనలు విధించనున్నట్లు సమాచారం. దీనిపై వివరణ కోరేందుకు ఇరిగేషన్‌ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement