నెల్లూరు(బృందావనం): నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మూడు రోజులు నిర్వహించే ఉత్సవాల్లో రెండోరోజు గురవారం ఉదయం, సాయంత్రం, రాత్రి శాస్త్రోక్తంగా నందిపూజ, యాగశాలపూజ, పవిత్ర సమర్పణ, హోమం, పూర్ణాహుతి, దీపారాధన తదితరాలను విశేషంగా చేశారు. ఉభయకర్తలుగా డాక్టర్ ఒ.గోపాలకృష్ణ, అంజని, మద్దిన విశ్వనాథం, బృంద దంపతులు వ్యవహరించారు.
మద్యంలో పురుగు
మందు కలిపి తాగి..
● వ్యక్తి బలవన్మరణం
వెంకటాచలం: ఓ వ్యక్తి మద్యంలో పురుగు మందు కలిపి తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కంటేపల్లిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంటేపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన ముత్యం నాగేంద్ర (55) మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్య నాగలక్ష్మి ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన నాగేంద్ర మద్యంలో పురుగు మందు తాగి పెద్దగా కేకలు వేయడంతో సోదరి రమణమ్మ గుర్తించింది. వెంటనే గ్రామస్తుల సహకారంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా నాగేంద్ర మృతిచెందాడు. నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


