నెల్లూరు(టౌన్): నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గురువారం ఎన్నికల పరిశీలకులు సదా భార్గవి పరిశీలించారు. వీఆర్ హైస్కూల్, పీఎన్‌ఎం స్కూల్లోని 54/2, 54/5, 54/6, 54/7, 58/1, 58/2, 58/3, 58/4, 58/5, 58/6, 58/7, 58/8, 58/9 నంబర్లు గల హైపర్ సెన్సిటివ్ కేంద్రాలను ఆమె తనిఖీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలిచ్చారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్ల నియామకం తదితర అంశాల్లో లోటుపాట్లు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని కేంద్రాల్లో నిబంధనలను పక్కాగా అమలు చేయాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆమె వెంట సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, రెవెన్యూ అధికారులున్నారు.


