● బ్రాండెడ్ మద్యమే కావాలి
● అభ్యర్థులకు మందుబాబుల డిమాండ్
సీతారామపురం: స్థానిక ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు డబ్బు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తుంటారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి ప్రచారం, పోలింగ్ వరకు ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తుంటారు. జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో మద్యం బ్రాండ్ల విషయంలోనూ కొందరు మందుబాబులు తమ అభిరుచిని స్పష్టంగా చెప్పేస్తున్నారు. గతంలో చీప్ లిక్కర్‌తో సరిపెట్టుకునేవారు సైతం ఇప్పుడు వివిధ కంపెనీలకు చెందిన బ్రాండెడ్ మద్యం కావాలని కోరుతున్నా. దీంతో ఓటర్ల డిమాండ్లను తీర్చాలంటే ఎన్నికల ఖర్చు మరింత పెరుగుతోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గత వారం రోజులుగా మద్యం దుకాణాల్లో విక్రయాలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. హోటళ్లు, ధాబాల్లోనూ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.


