తోటపల్లిగూడూరు/ముత్తుకూరు(పొదలకూరు): సర్వేపల్లిలో తెలుగుదేశంపై వ్యతిరేకతతో వైఎస్సార్‌సీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నట్టుగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే నాటికి టీడీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నెల్లూరులోని కాకాణి నివాసంలో ఆదివారం రాత్రి, సోమవారం ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లి పంచాయతీ సుబ్బారెడ్డిపాళెం, ఎస్సీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు, తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాళెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్టు చెప్పారు. నారికేళ్లపల్లి పంచాయతీకి చెందిన కాటంరెడ్డి వసంతకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలపాక మురళి, అత్తిపాటి శ్రీనివాసులు, తాండ్ర రాంబాబు, ఆలపాక వెంకటరమణమ్మ, దద్దోలు కిషోర్‌బాబు, బల్లెం కోదండయ్య, కొండాపురం పెదపుట్టయ్య, తాడిపర్తి వేణు, కొండాపురం చినపుట్టయ్య, ఆమలూరు దివాకర్, కమ్మంపాటి చిన పెంచలయ్య, కొండాపురం నవీన్, ఆమలూరు సుబ్రహ్మణ్యం, తాటిపర్తి భారత్ ఉన్నట్టు తెలిపారు. వెంకన్నపాళెం గ్రామం నుంచి గడ్డం శేషయ్య, పాముల చంద్రశేఖర్, బల్లెం సుధాకర్, బొమిడి సుమన్, బల్లెం పవన్, చింత సురేంద్ర, పి.కృష్ణ, గడ్డం రాజా, బొమిడి సుభాష్, ఆకాష్, పుచ్చలపల్లి సిద్దు, బల్లెం పోలయ్య, దుడ్డి రంగయ్య, బోయిన పోలయ్య, గడ్డం సుబ్బరాయులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నట్టు వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు. సోమి రెడ్డి నిర్లక్ష్యానికి గురైన నాయకులు తమ పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. సోమిరెడ్డి వ్యవహారశైలి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తున్నట్టు స్వయంగా టీడీపీ నాయకులు వెల్లడిస్తున్నట్టు చెప్పారు.
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


