● వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి
బైక్ వాటర్ సర్వీస్ చేస్తుండగా..
పొదలకూరు: పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఉన్న యమహా షోరూమ్‌లో సోమవారం విద్యుదాఘాతానికి గురై ఓ మెకానిక్ మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని డైకస్ రోడ్డుకు చెందిన ఎస్‌కే మొహిద్దీన్ (28) పొదలకూరులోని యమహా షోరూమ్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రోజూ నెల్లూరు నుంచి వచ్చి విధులు నిర్వహించి తిరిగి వెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం షోరూమ్‌కు వచ్చిన మొహిద్దీన్ బైక్‌కు వాటర్ సర్వీస్ చేసేందుకు గన్‌తో నీరు పడుతుండగా విద్యుత్ సరఫరా జరిగి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎం.శివరాకేష్ ఘటనా స్థలంలో ప్రాథమిక వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు.
వేపినాపిలో షిఫ్ట్ ఆపరేటర్
రాపూరు: మండలంలోని వేపినాపిలో సోమవారం విద్యుదాఘాతానికి గురై కాంట్రాక్ట్ షిఫ్ట్ ఆపరేటర్ రవీంద్ర (35) మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో స్తంభాలకు రవీంద్ర విద్యుత్ లైట్లు బిగిస్తుండగా షాక్‌కు గురై కిందపడి చనిపోయాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.


