మన భాషకు చిరునామా విశిష్ట అధ్యయన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

మన భాషకు చిరునామా విశిష్ట అధ్యయన కేంద్రం

Oct 27 2026 12:50 AM | Updated on Oct 27 2026 12:50 AM

● నూతన సంచాలకురాలు ప్రొఫెసర్‌ యద్దనపూడి రెడ్డి శ్యామల

వెంకటాచలం: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం మన భాషకు చిరునామా అని నూతన సంచాలకురాలు ప్రొఫెసర్‌ యద్దనపూడి రెడ్డి శ్యామల అన్నారు. మండలంలోని సరస్వతి నగర్‌ వద్ద ఉన్న కేంద్రంలో సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పూర్వ సంచాలకులు ప్రొఫెసర్‌ మాడభూషి సంపత్‌కుమార్‌ను ఘనంగా సన్మానించి వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ భాషా సంస్థ సంచాలకులు ప్రొఫెసర్‌ బసవరాజ కొడగుంటి, ప్రాచీన భాషల సమన్వయకర్త డాక్టర్‌ ఎల్‌ఆర్‌ ప్రేమ్‌కుమార్‌ వెబ్‌ ద్వారా ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు గంగిశెట్టి శివకుమార్‌, చిన్ని నారాయణ రావు, గోవిందరాజుల సుభద్రాదేవి, బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, తలారి మాలకొండయ్య, పద్మప్రియ, దివ్య, జయప్రకాష్‌ పాల్గొన్నారు.

కండలేరులో నీటి నిల్వ

రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 16.809 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement