నాడు అభివృద్ధి వెలుగులు.. నేడు అవినీతి పరవళ్లు | - | Sakshi
Sakshi News home page

నాడు అభివృద్ధి వెలుగులు.. నేడు అవినీతి పరవళ్లు

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్‌ ఎన్నికల వేళ సింహపురిలో వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రస్తుత కూటమి పాలనపై ప్రజల్లో చర్చ సాగుతోంది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే నెల్లూరు నగరానికి కొత్త హంగులు వచ్చాయి. టీడీపీ పాలనలో మాత్రం పనుల పేరుతో అవినీతి జరుగుతోంది.

అప్పట్లో ఇలా..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరంలో పలు కీలక అభివృద్ధి పనులు జరిగాయి. రామలింగాపురం జంక్షన్‌ వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టారు. సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్‌ కాలువలపై సుమారు రూ.200 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ల నిర్మాణం, మైపాడు ప్రధాన రహదారిపై రూ.9 కోట్లతో 2.7 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల సీసీ రోడ్డు నిర్మాణం వంటి పనులను చేపట్టాయి. నగరంలోని 12 జంక్షన్ల అభివృద్ధితోపాటు రూ.10.40 కోట్లతో 12 అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల నిర్మాణం కూడా గత పాలనలోనే జరిగింది.

కూటమి వచ్చాక..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రహదారులు అధ్వానంగా మారాయి. ఇక నగరంలో పారిశుద్ధ్యం గురించి కార్పొరేషన్‌ పట్టించుకోవడం లేదు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు అవి చేస్తాం.. ఇవి చేస్తామని చెప్పిన మాటలు నీటిమూటలయ్యాయి. ఆయన గతంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, చెత్త తొలగింపు, మొక్కల పెంపకం తదితర పనుల పేరుతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొన్నారు.

మినీబైపాస్‌లోని ముత్తుకూరు రోడ్డు జంక్షన్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్‌

పట్టణ ఆరోగ్య కేంద్రం

వైఎస్సార్‌సీపీ హయాంలో నగరానికి కొత్త హంగులు

కూటమి ప్రభుత్వంలో చేసిందేమీ లేదు

కార్పొరేషన్‌ ఎన్నికల వేళ అభివృద్ధి పనులపై చర్చ

ఎన్నికల వేళ..

కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. తమ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించే అభ్యర్థులను ఎన్నుకోవడంపై ఓటర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వ పనులు, ప్రస్తుత పాలనలో చేపడుతున్న కార్యక్రమాలను బేరీజు వేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement