సీతారామపురం: ఎన్నికలనగానే ఓటరు వేలిపై కనిపించే సిరా గుర్తు గుర్తుకొస్తుంది. దొంగ ఓట్లు, ఒకటికంటే ఎక్కువసార్లు ఓటు వేయడాన్ని నిరోధించడంలో ఈ సిరా కీలక పాత్ర పోషిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఓటరు ఎడమచేతి చూపుడు వేలిపై పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. నీటితో కడిగినా వెంటనే చెరిగిపోని ఈ గుర్తు.. ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలియజేస్తుంది. దేశంలో ఎన్నికల సమయంలో చెరగని సిరా వినియోగం 1962 నుంచి విస్తృతంగా అమల్లోకి వచ్చింది. కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థ ఈ సిరాను ఉత్పత్తి చేస్తోంది. కొంతకాలంగా హైదరాబాద్‌లోని రాయుడు లేబొరేటరీస్‌లోనూ సిరా తయారు చేస్తున్నారు. పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై సిరా గుర్తు వేయడం, దాన్ని నిర్ధారించుకోవడం పోలింగ్ సిబ్బంది బాధ్యత.
అక్రమంగా
మద్యం విక్రయాలు
● దాడుల్లో 40 క్వార్టర్ బాటిళ్ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): అక్రమంగా జరుగుతున్న మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 40 క్వార్టర్ బాటిళ్లను స్వా ధీనం చేసుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 1 ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు, ఎస్సై ప్రభాకర్‌రావులు తమ సిబ్బందితో కలిసి దాడులు చేస్తున్నారు. ఈనెల 24న మూడో మైలు, కొత్తూరు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న శ్యామ్‌బాబు, రామ్‌దాస్‌రెడ్డిని అరెస్ట్ చేసి 15 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ముత్తుకూరు గేటు సెంటర్‌లోని సులభ్ కాంప్లెక్స్ వద్ద విజయకుమార్‌ను అరెస్ట్ చేసి 25 క్వార్టర్ బాటిళ్లను పట్టుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు, రవాణా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.
బరిలో 217 మంది
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ఆదివారం విడుదల చేశారు. మొత్తం 72 డివిజన్లు ఉండగా వివిధ పార్టీలకు సంబంధించి 217 మంది పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి 64 మంది, ఇండిపెండెంట్లుగా 61, టీడీపీ 50, బీజేపీ 7, జనసేన 7, కాంగ్రెస్(ఐఎన్‌సీ) 12, బీసీవైపీ 2, సీపీఐ(ఎం) 11, సీపీఐ నుంచి 3 ముగ్గురు చొప్పున బరిలో ఉన్నారు.
చందన, సీఎంఆర్‌లో
దసరా లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): దసరా, దీపావళి పండగల సందర్భంగా నెల్లూరులోని చందన, సీఎంఆర్ ప్రవేశపెట్టిన బహుమతుల బొనాంజాలో ఆదివారం దసరా స్కూటీ డ్రాను డాక్టర్ జెడ్ శివప్రసాద్, డాక్టర్ ప్రసన్నలక్ష్మి తీశారు. నాయుడుపేటకు చెందిన పీఎస్ నారాయణ (కూపన్ నంబర్ 13908)ను విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందన, సీఎంఆర్‌లు నెలకొల్పి మూడు దశాబ్దాలు గడిచాయన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలంటే నెల్లూరు ప్రజలకు గుర్తుకొచ్చేది ఈ షోరూమేనని చెప్పారు. జనంతో అంత అనుబంధం ఉన్న సంస్థ తమ వినియోగదారుల కోసం పండగ సీజన్లలో అనేక ఆఫర్లు, బహుమతులు ఇవ్వడం జరుగుతోందన్నారు. నాణ్యమైన వ స్త్రాలు, బంగారు, వెండి వస్తువులు అత్యంత తక్కువ ధరలకే చందన, సీఎంఆర్‌లలో లభ్యమవుతున్నాయన్నారు. డైలీ డ్రా విజేతలు 125 మందికి ఇండక్షన్ స్టౌవ్, మిక్సీ, పట్టుచీర, కెటిల్, డిన్నర్‌సెట్లను అందజేశారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, మేనేజర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో
15.818 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 15.818 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 70, లోలెవల్ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


