కార్పొరేషన్‌లో విచ్చలవిడిగా దోపిడీ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో విచ్చలవిడిగా దోపిడీ

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నేతలు

నెల్లూరురూరల్‌: కూటమి నేతలు నెల్లూరు కార్పొరేషన్‌లో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. ఆదివారం 21వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా నగర భద్రత, శుభ్రత మన విజయన్న బాధ్యత పోస్టరను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు జూపూడి ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నగరంలో టీడీపీ నేతలు పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇంటి పన్నులు అమాంతంగా పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. కార్పొరేషన్‌లో జరుగుతున్న దౌర్జన్యాలుకు అంతే లేకుండా పోయాయన్నారు. వీటిని అరికట్టి నగరవాసులకు మంచి పరిపాలన అందించేందుకు మేయర్‌ అభ్యర్థిగా ఆనం విజయకుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆనం మాట్లాడుతూ తనకు అవకాశమిస్తే నగర భద్రత, శుభ్రతకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement