విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాదాలపై అప్రమత్తం

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● ఎస్‌ఈ సుధాకర్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ని విద్యుత్‌ వినియోగదారులు, రైతులు, కార్మికులు, విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ సుధాకర్‌ సూచించారు. నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు చెప్పారు. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపోయి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నందున ప్రజలు వాటికి దూరంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్తంభాలను తాకకూడదని ససూచించారు. రైతులు, ప్రజలు మోటార్లు, స్విచ్‌లను తడిచేతులతో వేయకూడదన్నారు. అదేవిధంగా లైన్ల మరమ్మతులు చేసే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా భద్రతా పరికరాలను వినియోగించాలన్నారు. సరఫరాను నిలిపివేసిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు. లైన్లు తెగిపడినా, స్తంభాలు పడిపోయినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement