● టీడీపీని వీడిన 50 కుటుంబాలు
● కాకాణి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
నెల్లూరురూరల్: సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరుకు చెందిన 50 కుటుంబాలు టీడీపీని వీడి శనివారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. నెల్లూరులోని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కోడి రవి, కోడి శ్రీనివాసులు, ఇంట్లూరు లోకేష్, ఎం.అనిల్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలనే లక్ష్యంతో యువత సహా 50 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషకరమన్నారు. గతంలో పార్టీకి దూరమైన వారు తిరిగి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి బహిష్కరించిన వారిని టీడీపీలో చేర్చుకుని, వారు పార్టీని వీడినట్లు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవహారశైలి, అవినీతి, అరాచకాల వల్లే సర్వేపల్లిలో టీడీపీ బలహీనపడుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని, రానున్న ఎన్నికల్లో జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.


