జీజీహెచ్‌లో అడిషనల్‌ డీఎంఈ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో అడిషనల్‌ డీఎంఈ తనిఖీ

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

● డాక్టర్ల తీరుపై అసహనం

నెల్లూరు(అర్బన్‌): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌)లో అడిషనల్‌ డీఎంఈ, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కొండేటి మాధవి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఓపీని చెక్‌ చేశారు. స్కానింగ్‌, ఎక్స్‌రే, క్యాజువాలిటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేన్సర్‌ విభాగంలో డాక్టర్లు లేకపోవడంపై నర్సులను ప్రశ్నించారు. డాక్టర్లు రౌండ్స్‌లో ఉన్నారని వారు కవర్‌ చేశారు. అనంతరం సర్జికల్‌ ఓపీ వద్దకు వెళ్లగా, అక్కడ దామరమడుగుకు చెందిన టి.మోహన్‌ అనే రోగి కడుపునొప్పితో నడవలేకపోతున్నాడు. ఆయన సూపరింటెండెంట్‌తో మాట్లాడుతూ తాను నొప్పితో అల్లాడుతున్నానని, రెండు గంటల నుంచి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. క్యాజువాలిటీకి వెళ్తే వారు అక్కడ వైద్యం చేయకుండా సర్జరీ ఓపీకి పంపించారని బాధపడ్డాడు. దీంతో మాధవి ఒక సెక్యూరిటీని తోడుగా ఇచ్చి క్యాజువాలిటీకి పంపి అత్యవసరంగా వైద్యం అందించేలా చేశారు. అనంతరం సర్జికల్‌ ఓపీ డాక్టర్లతో రోగి అల్లాడుతుంటే సకాలంలో వైద్యసేవలు ఎందుకు అందించలేదని నిలదీశారు. అక్కడ ఉన్న డాక్టర్లు పరీక్షలు కాలేదంటూ సర్దిచెప్పుకున్నారు. దీంతో ఆమె డాక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పరీక్ష విభాగాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఆమె వెంట ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్రీనివాసులు, సిస్టమ్స్‌ ఇన్‌చార్జి సురేష్‌, విజయలక్ష్మి, సెక్యూరిటీ ఇన్‌చార్జి రమణయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement