నెల్లూరు(అర్బన్): రోజురోజుకు పెరిగిపోతున్న బ్రెస్ట్(రొమ్ము) కేన్సర్‌పై మహిళలు తప్పనిసరిగా అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో అవగాహన ర్యాలీ జరిగింది. గాంధీబొమ్మ నుంచి మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్‌క్రాస్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ్త్రలలో ఎక్కువగా గర్భాశయ కేన్సర్‌తో పాటు రొమ్ము కేన్సర్‌లు వస్తున్నాయన్నారు. మహిళలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. రొమ్ములో గడ్డలు, అసాధారణ మార్పులు, ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. 40 ఏళ్లు పైబడిన మహిళలందరూ ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటే వంద శాతం నయం చేయవచ్చన్నారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ కో–ఆర్డినేటర్ యాలమూరి రంగయ్యనాయుడు, రెడ్‌క్రాస్ అడ్‌హక్ కమిటీ నాయకులు చమర్తి జనార్దన్‌రాజు, సెక్రటరీ మస్తానయ్య, కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


