తమ్ముళ్లూ.. ఇదేనా అభివృద్ధి? | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లూ.. ఇదేనా అభివృద్ధి?

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

‘కూటమి పాలనలో నెల్లూరు నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రోడ్లు బాగు చేశాం. సుందరీకరణ పనులు చేపట్టాం. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో స్వచ్ఛ అవార్డులు వచ్చాయి. అండర్‌ బ్రిడ్జిల్లో నీరు నిల్వ చేరకుండా రూ.కోట్లతో పనులు నిర్వహించాం’ అంటూ దొరికిన వేదికల్లో అధికార పార్టీ నేతలు ఊదరగొట్టుతున్నారు. కానీ వాస్తవం వేరు. మూడు రోజులుగా కురుస్తున్న చిరు జల్లులకు నగరంలోని రోడ్లు దారుణంగా మారాయి. ఇటీవల కాలంలో మరమ్మతుల పేరుతో పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేశారు. కానీ అదంతా వృథా అని తేలిపోయింది. ప్రధాన వీధుల్లో నీళ్లు చేరి వాహనదారులు పడిన బాధలు వర్ణనాతీతం. ఇక అండర్‌ బ్రిడ్జిల్లో నీరు నిల్వ చేరడంతో ప్రజలు నరకం చూశారు. కొన్ని కూడళ్లలో మురుగు దుర్ఘంధానికి ముక్కుపుటరాలు అదిరిపోతున్నాయి. జిల్లాకు చెందిన పొంగూరు నారాయణ మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. నగరంలో వర్షాలకు నెలకొన్న పరిస్థితులు చూసి ఇదా మీ పాలన ఉంటూ ఆయన్ను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement