మలిసంధ్యలో తీరని వేదన | - | Sakshi
Sakshi News home page

మలిసంధ్యలో తీరని వేదన

Oct 24 2026 12:04 AM | Updated on Oct 24 2026 12:04 AM

● వేర్వేరు చోట్ల ఇద్దరు వృద్ధుల ఆత్మహత్య

మలిసంధ్యలో ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధాప్యం కొందరి జీవితాల్లో తీరని వేదనను మిగిలిస్తోంది. ఒంటరితనం, కుటుంబ

సమస్యలు, అనారోగ్యం.. ఇలా కారణాలేవైనా కొందరు వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది.

చీరతో ఉరేసుకుని..

నెల్లూరు(క్రైమ్‌): ఒంటరితనం భరించలేక ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఆమె నివాసం నుంచి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. చంద్రమౌళినగర్‌ ఆరో వీధిలో పార్వతమ్మ (75) నివాసం ఉంటున్నారు. ఆమె భర్త ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. పిల్లలకు వివాహాలై వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. తనకొచ్చే పింఛన్‌, మిలటరీ కాలనీలో ఉంటున్న కుమారుడు గజేంద్ర అందించే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఆమె నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు కుమారుడికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అతను వెళ్లిచూడగా ఇంట్లోని రేకుల కింద ఉన్న ఇనుప పైపునకు చీరతో ఉరేసుకుని తల్లి మృతిచెంది ఉండటాన్ని గుర్తించాడు. ఈనెల 19వ తేదీన ఆమెను చూసినట్లు స్థానికులు చెప్పారు. తన తల్లి ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని గజేంద్ర వేదాయపాళెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

ఏం కష్టమొచ్చిందో..

చేజర్ల: వృద్ధాప్యంలో ఆయనకు ఏ కష్టం వచ్చిందో తెలియదు గానీ.. విషగుళికలు తిని అపస్మారక స్థితిలో చేరుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని చిత్తలూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాడేరు గ్రామానికి చెందిన వేమయ్య (65) ఆదూరుపల్లి – చిత్తలూరు ప్రధాన రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు శుక్రవారం గమనించారు. వెంటనే 108కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బంది వృద్ధుడిని చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో 108 సిబ్బంది ఆయన్ను అక్కడికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. వేమయ్యకు భార్యాబిడ్డలు లేరని, చెల్లెలు, బావ ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆదరణ లేక బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. చేజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement