● గూడూరులో ఇనుప కంచెలను
లెక్కచేయని టీడీపీ శ్రేణులు
● తీవ్ర ఉద్రిక్తత
గూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా గూడూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల దాఖలుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి పత్రాలను బలవంతంగా లాక్కునేందుకు టీడీపీ శ్రేణులు యత్నించారు. శాంతిభద్రతల పరిరక్షణ.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రోడ్లపై ఇనుప కంచెలను ఖాకీలు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. అయినా ఈ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు. బారికేడ్లను నెట్టేస్తూ.. కంచెలను లాగుతూ పచ్చ శ్రేణులు దౌర్జన్యంగా ముందుకు దూసుకెళ్లారు.


