జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని చినబాలయ్య నగర్‌ హైస్కూల్‌ ఏడో తరగతి విద్యార్థి ఆవుల హరనాథ్‌ యోగాలో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. కావలిలో అక్టోబర్‌ 10, 11 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో సబ్‌ జూనియర్‌ విభాగంలో మూడో స్థానం సాధించాడు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ యోగా అసోసియేషన్‌, ఇండియన్‌ యోగ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. డిసెంబరులో జార్ఖండ్‌ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో హరనాథ్‌ పాల్గొంటాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్దాడ వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు విద్యార్థిని గురువారం అభినందించారు. కార్యక్రమంలో పీడీ ఎం.రేవతి, ఉపాధ్యాయులు ఎంసీ అచ్చయ్య, కమల, ప్రసాద్‌, నాగేశ్వరి, తిరుపాల్‌ రాజా, బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement