ప్రమాదం.. విషాదం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం.. విషాదం

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

● వేర్వేరు చోట్ల ఇద్దరి మృతి

స్వగ్రామానికి వెళ్తుండగా..

మనుబోలు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై రాయల్‌ హోటల్‌ ఎదురుగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన ఆముదాలపల్లి మల్లికార్జునరావు తన అత్త కంభం జయలక్ష్మి (54)తో కలిసి చైన్నెలోని బంధువుల ఇంటికి వెళ్లి కారులో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాయల్‌ హోటల్‌ ఎదురుగా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమవగా, వెనుక సీట్‌లో కూర్చున్న జయలక్ష్మి అక్కడికక్కడే చనిపోయారు. కారు నడుపుతున్న మల్లికార్జునరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

వెంకన్నపాళెం వద్ద..

కోట: మండలంలోని వెంకన్నపాళెం వద్ద ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాకాడులో వీఆర్‌ఏగా పనిచేస్తున్న పరుశురామయ్య (55) మృతి చెందాడు. వాకాడు నుంచి స్కూటీపై కోటకు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న పరుశురామయ్య మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. అతను స్కూటీపై వెళ్తూ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడా?, లేక గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమా దం జరిగిందా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement